News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

కోనసీమ: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతా రంగాలకు మాత్రమే LPG నిరంతరాయంగా సరఫరా చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో శనివారం జిల్లాలోని 25 గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. డీలర్లు వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో కీలక భూమిక పోషించాలని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

News March 14, 2026

అనకాపల్లి: అక్షరాంధ్ర పరీక్షలను విజయవంతం చేయాలి

image

జిల్లావ్యాప్తంగా ఈనెల 15వ తేదీన నిర్వహించే అక్షరాంధ్ర పరీక్షను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. అక్షరాంధ్ర పరీక్షపై శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లా మండల స్థాయి అధికారులతో వెబెక్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 93,292 అభ్యాసకులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. 2,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 2,478 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.

News March 14, 2026

ఢిల్లీలో కట్టెల పొయ్యిపై నిషేధం ఎత్తివేత

image

గ్యాస్ కొరతతో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై కేంద్రం నిషేధం ఎత్తివేసింది. దీంతో ప్రజలు వాటితో వంట చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయింది. దేశ రాజధానిలో తీవ్ర కాలుష్యం దృష్ట్యా కట్టెల పొయ్యిపై నిషేధం ఉండేది. ఎల్పీజీ సంక్షోభంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని, సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేయడం గమనార్హం.