News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 1, 2026
హనుమాన్ జయంతి వేడుకల్లో మేయర్ మమత

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మేయర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ఆయన ఆశీర్వచనం ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ADB: సీఎం పర్యటన.. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీసీసీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.