News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 10, 2026
సిరిసిల్ల: జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన క్రీడాకారిణి ఎంపికైంది. గ్రామానికి చెందిన గుంటుక లయ హైదరాబాద్‌లోని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఓయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీల్లో లయ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఓయూ ఉమెన్స్ టీం తరఫున పోటీల్లో పాల్గొననుంది.
News March 10, 2026
ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయింది: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని US ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసేందుకు 4-5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే పూర్తి కాబోతున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇప్పుడు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఏవీ లేవని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ట్రంప్ ఫోన్ కాల్‌లో చర్చించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.
News March 10, 2026
కడప: MSPతో 10,059 క్వింటాళ్లు కొనుగోలు

కడప జిల్లాలో సోమవారం నాటికి రైతుల నుంచి కనీస మద్దతు ధర(MSP)తో 10,059 క్వింటాళ్ల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. సుమారు 2,021 మంది రైతుల నుంచి 8,210 క్వింటాళ్ల శనగలు, 50 మంది రైతుల నుంచి 1,819 క్వింటాళ్ల కందులు, 1 రైతు నుంచి 30 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేశారు. జిల్లాలో 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో క్వింటాలుకు రూ.200లు రాబడుతున్నారు.


