News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
MHBD: SC/ST కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా స్థాయి SC/ST విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె. శ్రీనివాసరావు తెలిపారు. SC/ST వర్గాలకు చెందిన గరిష్టంగా ఐదుగురు అనధికార సభ్యులను ఎంపిక చేయనున్నారు. ఉన్నత విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నవారు ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 18, 2026
2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించినట్లు మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.
News March 18, 2026
ఆదోని: యువతి ఆత్మహత్య

ఆదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల (23) అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీమప్ప, నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె, బీ-ఫార్మసీ పూర్తి చేసి ఆదోనిలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


