News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 24, 2026
బస్వాపూర్ ఆర్‌అండ్‌ఆర్ లేఅవుట్లపై కలెక్టర్ ఫోకస్

బస్వాపూర్ రిజర్వాయర్ ఆర్‌అండ్‌ఆర్ పనులపై కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి బి.ఎన్. తిమ్మాపురం, లప్పానాయక్ తండా లేఅవుట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులు, కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, నిర్వాసితులకు ఇబ్బంది కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
News March 24, 2026
మన దగ్గర ఎన్నిరోజులకు సరిపడా ఇంధనం ఉందంటే..

దేశంలో దిగుమతులకు అంతరాయం ఏర్పడితే మన క్రూడాయిల్ రిజర్వులు(100% కెపాసిటీ) 9.5 రోజులకే సరిపోతాయని కేంద్రం వెల్లడించింది. వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు(SPR)ల్లో 33.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ నిల్వ ఉందని తెలిపింది. APలోని విశాఖ, KAలోని మంగళూరు, పాదూర్‌లో ఈ రిజర్వులు ఉన్నట్లు వివరించింది. వీటి మొత్తం కెపాసిటీ 53.3L MT అని పేర్కొంది. RTI ద్వారా India Today అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.
News March 24, 2026
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

ఏలూరు-దుగ్గిరాల జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయరాయి నుంచి విజయవాడ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


