News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 21, 2026
ఇంద్రవెల్లిలో రేపు రగల్ జెండా అత్యవసర సమావేశం

ఇంద్రవెల్లిలోని రగల్ జెండా భవనంలో ఆదివారం ఆదివాసీల అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రగల్ జెండా కమిటీ ఛైర్మన్ తొడసం నాగోరావ్ తెలిపారు. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరుల ఆశయ సాధన కోసం ఏప్రిల్ 20న నిర్వహించే కార్యక్రమంపై చర్చించనున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ఉద్యమకారులు, నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు.
News March 21, 2026
పాక్ క్రికెట్‌లో టాక్సిక్ వర్క్ కల్చర్: గ్యారీ కిర్‌స్టెన్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తీవ్ర విమర్శలు చేశారు. బోర్డులో ఇతరుల జోక్యం, టాక్సిక్ వర్క్ కల్చర్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని తానెక్కడా చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్‌కు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారన్నారు. వృత్తిపరమైన గౌరవం లేకపోవడంతో రిజైన్ చేసినట్లు తెలిపారు. కాగా ఆయన APR 15న శ్రీలంక కోచ్‌గా బాధ్యతలు <<19339760>>చేపట్టనున్నారు.<<>>
News March 21, 2026
వనపర్తి: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

భారత సైన్యంలో 2027 సంవత్సరానికి గానూ ‘అగ్నివీర్’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమైనట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తుకు వెబ్‌సైట్:
www.joinindianarmy.nic.in


