News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 4, 2026

ఖమ్మం : భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని..

image

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో కలకలం రేపింది. గొళ్లపాడుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సంపేట శివపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తల్లంపాడు వెంచర్ నుంచి తిరిగి వస్తుండగా, ఆరెకోడు క్రాస్ రోడ్ వద్ద శివను అడ్డగించి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో తప్పించుకున్న శివ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News April 4, 2026

పంజాబ్ విజయం.. గర్వంగా ఉందన్న ప్రీతి జింటా

image

చెన్నైపై పంజాబ్ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల యజమాని ప్రీతి జింటా సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణంలో ఉండటం వల్ల మ్యాచ్ చూడలేకపోయానని పేర్కొన్నారు. అయితే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తీరు గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, కూపర్ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించారు. జట్టు సమష్టి కృషితోనే ఈ విజయం దక్కిందని కొనియాడుతూ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

News April 4, 2026

రాత్రి ఆదిలాబాద్‌లో యువకుడి హత్య..!

image

ఆదిలాబాద్‌లో హత్య ఘటన శుక్రవారం రాత్రి కలకలం రేపింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడలో రాజేశ్‌కు అనే వ్యక్తికి మరో వ్యక్తితో గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రాజేశ్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.