News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 18, 2026

VZM: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఉగాది వేడుకలను స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలు పాల్గొనాలని కోరారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

ప్రకాశం భవనంలో జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులు 22(ఏ) కేసులు, మ్యుటేషన్లు, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు వారాల గడువులోనే కేసులు పరిష్కరించాలని తెలిపారు. ప్రజల సమస్యలు ఆలస్యం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.