News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

వినతులను స్వీకరించిన ఏలూరు ఎస్పీ

image

ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. SP ప్రతాప్ శివ కిషోర్
ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా అర్జీదారుల నుంచి 46 ఫిర్యాదులు సేకరించినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులు https://meekosam.ap.gov.inలో కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

News March 16, 2026

నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు చేయరాదన్నారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 16 నుంచి మార్చి 31 వరకు అమలులో ఉంటాయన్నారు. శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు.

News March 16, 2026

కామారెడ్డి: సమస్యలపై తక్షణమే స్పందించండి: అదనపు కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొని, వచ్చిన దరఖాస్తుదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.