News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 5, 2026
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ చేయడంతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించాలని, మహిళల హక్కులు, భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
News March 5, 2026
కడియంపై తీర్పు రిజర్వు చేసిన స్పీకర్

TG: MLAలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ విచారణ కొనసాగించారు. శ్రీహరికి సంబంధించి ఇరువర్గాల వాదనలు విన్న స్పీకర్ తీర్పును రిజర్వు చేశారు. కాగా BRS పిటిషన్‌పై సమాధానమిచ్చేందుకు కొంత సమయం కావాలని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు స్పీకర్‌ను కోరారు. మరోపక్క SC సూచనలతో కౌశిక్ రెడ్డి న్యాయవాదులు రాత పూర్వక వివరణను స్పీకర్‌కు అందించారు.
News March 5, 2026
ఫోన్‌పే ‘ముద్ర’.. ఫ్యూచర్‌లో UPI పేమెంట్లన్నీ అలానే?

UPI పేమెంట్ల కోసం <<19190765>>బయోమెట్రిక్ వ్యవస్థ<<>>ను తీసుకొచ్చి ఫోన్‌పే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దశాబ్దకాలంగా కేవలం పిన్ ద్వారానే పేమెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫోన్‌పే తెచ్చిన ఫింగర్ ప్రింట్/ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ భవిష్యత్ UPI చెల్లింపుల్లో కీలకం కానుంది. పిన్ మరిచిపోయినా ఇబ్బంది లేకపోవడం, సింగిల్ టచ్ పేమెంట్, ఫాస్ట్, సేఫ్ ప్రాసెస్ కావడంతో మిగతా కంపెనీలూ దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది.


