News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 31, 2026

GNT: అడ్మిషన్లకు ఏప్రిల్ 2 చివరి తేదీ

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతి అడ్మిషన్లకు మార్చి 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 2తో గడువు ముగియనుంది. 2026 మార్చి 31 నాటికి 6 ఏళ్లు పూర్తి కావాలి. అధికారిక వెబ్‌సైట్లో దరఖాస్తు చేయాలి. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి. ఎంపిక లాటరీ విధానంలో జరుగుతుంది. 2వ తరగతిపై తరగతులకు ఏప్రిల్ 2 – 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

News March 31, 2026

చింతలపూడి నగర పంచాయతీలో అవినీతికి అందలం..!

image

చింతలపూడి నగరపంచాయతీలో <<19521774>>టెండర్ల ప్రక్రియ రద్దు<<>> అవినీతి ఆరోపణలకు దారితీసింది. సాఫ్ట్ లోన్ పనులకు టెండర్లు పిలిచి, ప్రైస్ లిస్ట్ ప్రకటించిన తర్వాత అధికారులు వాటిని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ వారికి టెండర్లు దక్కలేదనే ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

News March 31, 2026

NTR జిల్లాలో అక్కడ వారం రోజులు మాంసం బంద్

image

చందాపురం గ్రామంలో డయేరియా ప్రబలుతున్న దృష్ట్యా మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నందిగామ పురపాలక సంఘం పరిధిలోని అన్ని హోటల్స్, చికెన్ షాపులు, కర్రి పాయింట్లలో మాంసం నిషేధించాలని ఆదేశాలిచ్చింది. ఈనెల31 (నేడు) నుంచి ఏప్రిల్ 8 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు.