News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 18, 2026

మెదక్-నర్సాపూర్ రహదారిపై ప్రమాదం.. ఇద్దరి మృతి

image

మెదక్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పోతంశెట్టిపల్లికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండీ యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరేకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News March 18, 2026

నిర్మల్: మహిళా ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో మహిళా ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని, సమస్యలుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళా ఉద్యోగుల భద్రత, హక్కుల రక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు.