News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 25, 2026

రేకొండలో విషాదం.. కారు ఢీకొని వ్యక్తి మృతి..!

image

చిగురుమామిడి మండలం రేకొండలో <<19469508>>మంగళవారం<<>> సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన పొలం వద్దకు వెళ్తున్న గోపగొని రమేష్‌ను ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ మరిణించారు. రమేష్ మరణంతో రేకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 25, 2026

నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపిన RDT నిర్వాహకులు

image

పేదల సేవలో ముందుండే RDT సంస్థకు ఏర్పడిన అడ్డంకులను తొలగించేందుకు మంత్రి లోకేశ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి FCRA పునరుద్ధరణకు అనుమతులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని RDT నిర్వాహకులు మాంచో ఫెర్రర్ అన్నారు. దీంతో వారు మంత్రి నారా లోకేశ్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఓ మంత్రికి చెబుతున్న కృతజ్ఞత కాదని.. RDT తరపున లక్షలాది ప్రజలకు ఉపయోగపడిన మంచి మనిషికి అందిస్తున్న ఆశీస్సులని వివరించారు.

News March 25, 2026

సుల్తానాబాద్ కేంద్రంగా కొత్త నియోజకవర్గం..?

image

జిల్లాలో ప్రస్తుతం రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు ఉన్నాయి. సుల్తానాబాద్ కేంద్రంగా ధర్మారం, ఎలిగేడు, ఓదెల, జూలపల్లి మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, అంతర్గాం, పాలకుర్తి(పెద్దపల్లి), రామగుండం మున్సిపాలిటీ కేంద్రంగా ఒక నియోజకవర్గం, కమాన్ పూర్, రామగిరి, ముత్తారం మంథని మండలాలతో నియోజకవర్గాలు ఏర్పడతాయనే చర్చ SMలో నడుస్తోంది.