News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 5, 2026
NZB: ఈ మండలాలకు రిపోర్టర్లు కావలెను

ఆర్మూర్, ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్, మాక్లూర్, జక్రాన్‌పల్లి, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, రెంజల్, కోటగిరి మండలాలకు Way2Newsలో పని చేసేందుకు అనుభవం కలిగిన రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల వారు <
News March 5, 2026
సంతానోత్పత్తికోసం ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’: CBN

AP: సంతాన లేమితో బాధపడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. PPP మోడల్‌లో ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లు ఏర్పాటు చేసి సబ్సిడీపై IVF సేవలు అందించాలని యోచిస్తున్నామన్నారు. ‘ఒకప్పుడు 3.0గా ఉన్న ఫెర్టిలిటీ రేట్ 1.5కి తగ్గిపోయింది. దీనివల్ల పనిచేసే వారి సంఖ్య తగ్గి ఆర్థిక వృద్ధి పడిపోతుంది. టీనేజ్ గర్భధారణలు తగ్గించే చర్యలు చేపడుతున్నాం’ అని CBN పేర్కొన్నారు.
News March 5, 2026
BREAKING: అసెంబ్లీలో హోం మంత్రికి అస్వస్థత

హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం అసెంబ్లీలో అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పడంతో తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మార్షల్స్ సభ బయటకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హుటాహుటిన విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


