News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 30, 2026

మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

image

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. అందుకే నిపుణుల సూచనలతో సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్‌ని వాడితే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.

News March 30, 2026

APR 12న ఇంటర్ ఫలితాలు!

image

TG: ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్12న విడుదలయ్యే అవకాశముంది. జవాబు పత్రాల వాల్యుయేషన్ ఆదివారంతో ముగిసింది. 3రోజుల పాటు ఫలితాలను క్రోడీకరించి సింగిల్ సబ్జెక్టులో ఫెయిలైన వారి ఆన్సర్ షీట్లను బోర్డు ర్యాండమ్‌గా చెక్‌చేయించనుంది. కంప్యూటరీకరణ ముగించి APRలో రిజల్ట్స్ విడుదల చేయనుంది. దీనికోసం 3 తేదీలతో(8, 10, 12) ప్రతిపాదనలు పంపింది. JEE మెయిన్స్ 8వరకు ఉన్నందున ఆ తరువాత 12న విడుదల చేయొచ్చని తెలుస్తోంది.

News March 30, 2026

కర్నూలు: ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంటనహాల్ గ్రామంలో ఆస్తి కోసం కన్నకొడుకే తండ్రిని హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. నానేసాబ్ రెండో భార్య గర్భవతి కావడంతో, పుట్టబోయే బిడ్డకు ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో మొదటి భార్య కుమారుడు నూర్ సాబ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆదివారం రాత్రి నానేసాబ్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.