News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 24, 2026
ఆర్టీసీలో సమ్మె హెచ్చరికలు.. రేపు చర్చలు

TG: తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామని RTC JAC హెచ్చరించడంతో ప్రభుత్వం స్పందించింది. రేపు HYDలోని అంజయ్య భవన్‌లో చర్చలకు రావాలని సంస్థ ప్రతినిధులు, JAC ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థలోకి యూనియన్ల అనుమతి, 2021, 2025 జీత భత్యాల సవరణ, డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై మార్గదర్శకాలు, బకాయిలను విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
News March 24, 2026
జనగామ: వలకు చిక్కిన 25 కిలోల చేప

జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ పెద్ద చెరువులో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న బంగారు తీగ రకం చేప పడటంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని చేపను ఆసక్తిగా వీక్షించారు. సాధారణంగా ఇంత పెద్ద పరిమాణంలో చేపలు కనిపించడం అరుదని స్థానికులు తెలిపారు.
News March 24, 2026
తిరుపతి: తప్పుడు నివేదిక.. వృద్ధురాలి ఆవేదన

పిచ్చాటూరు(M) అడవికోడియంబేడుకు చెందిన దమయంతి సాగుభూమికి వెళ్లేందుకు దారి చూపాలని కలెక్టర్‌కు PGRSలో ఫిర్యాదు చేసింది. తాను పొలానికి వెళ్లే మార్గం లేకుండా ప్రహరీ కట్టారని వాపోయింది. విచారణ చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మండల రెవెన్యూ అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించకుండా కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు పంపినట్లు సమాచారం. ఆమె మళ్లీ కలెక్టర్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు.


