News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 7, 2026

ఏకీకృత కుటుంబ సర్వే మూడు రోజులలో పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వేను మరో మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 7,55,812 కుటుంబాలకు ఇప్పటివరకు 6,51,697 కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News March 7, 2026

మానవపాడు: 1200 ఏళ్ల చరిత్ర.. అరుదైన విగ్రహాల గుర్తింపు

image

మానవపాడు మండలంలోని బోరవెల్లిలో అరుదైన చారిత్రక సంపదకు నిలయంగా నిలుస్తోందని, బాదామి చాళుక్యుల నుంచి నిజాం కాలం వరకు ఉన్న వివిధ రాజవంశాల ఆనవాళ్లను సోమవారం పరిశోధించి గుర్తించామని పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. 8వ శతాబ్దం బాదామి చాళుక్యుల కాలపు చండి, చాముండి విగ్రహాలని గుర్తించారు. 1200 ఏళ్ల వారసత్వాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు

News March 7, 2026

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామాల్లో 3.60L ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో లక్ష యూనిట్లకు ఈ నెల 31లోగా గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులను నిలిపేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకూ అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. APRలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.