News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 19, 2026

మంచిర్యాల: తండ్రి మందలించాడని వర్షిత సూసైడ్

image

తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 2-టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సుభాష్ నగర్‌కు చెందిన వర్షిత(17) తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చింది. ఇంట్లో చెప్పకుండా డబ్బులు అప్పు ఇవ్వడం ఏంటని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కేసు నమోదైంది.

News March 19, 2026

మూడో బిడ్డకు జన్మనిచ్చిన దినేశ్ కార్తీక్ దంపతులు

image

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి ‘రాహా పల్లికల్ కార్తీక్’గా పేరు పెట్టినట్లు DK తెలిపారు. వీరికి 2021లో కవల మగ పిల్లలు కబీర్, జియాన్ జన్మించిన విషయం తెలిసిందే. కాగా కార్తీక్ 2007లో నిఖితను వివాహం చేసుకోగా 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో దీపికాను పెళ్లాడారు.

News March 19, 2026

MBNR: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

image

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68,288 అంత్యోదయ కార్డులు, 10,24,472 ఆహార భద్రత కార్డులు ఉన్న లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.