News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 17, 2026
నవోదయలో కోదాడ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

కోదాడ పట్టణానికి చెందిన మేకల సాయి శ్రీయాంక్ నవోదయ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించాడు. 97.5 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. శ్రీయాంక్ తండ్రి చంద్ర శేఖర్ అనంతగిరి మండలం వాయిల సింగారంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి గోల్తాండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీయాంక్‌ను పలువురు అభినందించారు.
News March 17, 2026
గుండాల తహశీల్దార్ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

గుండాలలో నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా నిర్దిష్ట గడువులో కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
News March 17, 2026
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి కొండపల్లి

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పన కోసం అనేక సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.


