News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 22, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మూడో రోజు కలెక్షన్లు ఇవే

image

హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 3 రోజుల్లో రూ.63.08 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు Sacnilk వెల్లడించింది. మొత్తంగా రూ.53.90 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. మూడో రోజు శనివారం 36 శాతం ఆక్యుపెన్సీతో రూ.9.15 కోట్లు(నెట్) వసూలైనట్లు పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వసూళ్లపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News March 22, 2026

రాజమండ్రి: వేసవి కార్యాచరణ సిద్ధం

image

వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి నుంచే ఎండల తీవ్రత పెరుగుతున్నందున తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

News March 22, 2026

చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

image

దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డును సృష్టించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే అత్యధిక రోజులు(8,931) ప్రభుత్వాధినేతగా(గుజరాత్ CM+ దేశ PM) పని చేసిన వ్యక్తిగా నిలిచారని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ CM పవన్ చామ్లింగ్(8,930) రికార్డును బ్రేక్ చేశారన్నారు. మోదీ గుజరాత్ CMగా 12 ఏళ్ల 227 రోజులు పనిచేశారు. PMగా నేటితో 11 ఏళ్ల 299 రోజులు పూర్తి చేసుకున్నారు.