News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 17, 2026
ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 17, 2026
NLG: రైతులకు అలర్ట్.. రాబోయే రెండు రోజులు వర్షాలు!

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 8 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News March 17, 2026
నిర్దోషిగా బయటకు వస్తా: ఏలూరు MP

హైదరాబాద్‌లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, ఎంపీగా గెలిపించిన ప్రజలకు, పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘విచారణలో నేను నిర్దోషిగా బయటకు వస్తా’ అని పేర్కొన్నారు.


