News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 15, 2026
పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్

AP: పార్టీ చీఫ్ చంద్రబాబు <<19391495>>ఆదేశాలతో<<>> పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
News March 15, 2026
నిర్మల్: రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులను నిర్వహించాలని, మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలలకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు.
News March 15, 2026
బద్వేల్‌లో గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

బద్వేల్‌లోని హోటళ్లపై ఆదివారం కడప జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, బద్వేల్ ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు మైదుకూరు రోడ్ పరిసర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. పలువురు నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 7 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


