News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 19, 2026

విశాఖ: భయంతో బుకింగ్స్..

image

విశాఖలో LPG సిలిండర్ల వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగింది. రోజుకు సగటున 18 వేల సిలిండర్లే సరఫరా అవుతుండగా, 18వ తేదీ నాటికి 1.69 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇప్పటికే బుక్ చేసిన వారికి 7 నుంచి 8 రోజులు ఆలస్యం అవుతోంది. యుద్ధ భయంతో అవసరం లేకున్నా వినియోగదారులు బుకింగ్ చేయడం పరిస్థితిని కష్టతరం చేసిందని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా 25-28 వేల డెలివరీలు ఉండగా ఇప్పుడు 15-18 వేలకే పరిమితమయ్యాయి.

News March 19, 2026

ఈనెల 23వ తేదీ నుంచి బూర్గులమ్మ మహా కుంభాభిషేక మహోత్సవాలు

image

రేపల్లె పట్టణంలో వేంచేసి ఉన్న బూర్గులమ్మ గ్రామదేవత అమ్మవారి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు నందివెలుగు భాను సుధాకర్ గురుకుల్ తెలిపారు. మూడు రోజుల పాటు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయ శిఖరానికి అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.

News March 19, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒MBNR: రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా MLA యెన్నం శ్రీనివాసరెడ్డి
✒పాలమూరు: టీచర్ పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం
✒ ఘనంగా ఉగాది ఉత్సవాలు
✒నాగర్‌కర్నూల్: గంజాయి కలకలం.. యువకుల అరెస్ట్
✒28న జాతీయ లోక్ ఆదాలత్
✒ఉగాది వేళ.. ఆలయాల వద్ద రద్దీ
✒ఉగాది, రంజాన్ EFFECT.. బస్టాండ్ల వద్ద రద్దీ
✒పలుచోట్ల ఇఫ్తార్ విందు
✒TGRJC CET-2026.. దరఖాస్తుల ఆహ్వానం
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్