News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 18, 2026

పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు ఉగాది కానుక

image

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలో చాలా గ్రామాలు ముంపుకు గురవుతున్న విషయం తెలిసిందే. నిర్వాసితులకు బుధవారం ఉగాది కానుకగా 3వ విడత ఆర్ అండ్ ఆర్ నష్టపరిహారం రూ. 250 కోట్ల చెక్కును అమరావతిలో సీఎం చంద్రబాబు అందించారు. పోలవరం జిల్లాలోని చింతూరు డివిజన్‌లో నిర్వాసితులను ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అమరావతి తీసుకువెళ్లి వారికి సీఎం చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.

News March 18, 2026

విజయవాడలో వేడుకల కోసం వెండి రథం

image

ఉగాది పండగ, వసంతోత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వెండి రథం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం గురువారం ప్రారంభం కానున్నట్లు అర్చకులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వెండి రథ ఊరేగింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేపడుతున్నామన్నారు.

News March 18, 2026

దివ్యాంగ చిన్నారులతో విశాఖ కలెక్టర్ ఆత్మీయ విందు

image

విశాఖలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.