News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 20, 2026
VZM: దొంగతనానికి వచ్చి.. మృత్యువుకు చిక్కి

నగరంలోని దాసన్నపేట మెయిన్ రోడ్డు జమ్మునారాయణపురం పరిధిలోని వై-జంక్షన్ వద్ద గల ఓ ప్రైవేటు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌లో తెల్లవారుజామున దొంగతనానికి వచ్చిన ఓ దొంగ భవనం పైనుంచి కాలు జారి కింద పడిపోయి మృతి చెందినట్లు ఎస్ఐ కృష్ణ మూర్తి తెలిపారు. మృతుడి గురించి ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కాగా 9 నెలల క్రితం ఇదే ఆసుపత్రికి దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి లిఫ్ట్ పైనుంచి పడి మరణించాడు.
News March 20, 2026
NTR: 452 ఉద్యోగాల భర్తీకి అమరావతిలో జాబ్ మేళా

APSSDC, CRDA ఆధ్వర్యంలో అమరావతి-తుళ్లూరు CRDA స్కిల్‌హబ్‌లో మార్చి 25న జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా ద్వారా రూ.8,000- 40,000 వేతనంతో పలు సంస్థలలో 452 ఉద్యోగాలను భర్తీ చేస్తామని APSSDC అధికారులు తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, బీటెక్, పీజీ, ఎంబీఏ చదివిన 18-50 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చన్నారు.
News March 20, 2026
సిద్దిపేట: రోడ్డు పక్కన మృతదేహం

సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట వైపు వెళ్తున్న TS09GA 6641 నంబర్ గల బైకుపై ఉన్న వ్యక్తి శవమై పడి ఉన్నాడు. ఈ ప్రమాదం రాత్రి వేళ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


