News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

ఫాస్టాగ్ వార్షిక పాసుల ధరలను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది. ప్రస్తుతం రూ.3వేలు ఉండగా ఏప్రిల్ 1 నుంచి రూ.3,075 వసూలు చేయనున్నట్లు తెలిపింది. కార్లు, జీపులు, వ్యాన్ల లాంటి ప్రైవేట్ నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. ఏడాది కాలం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందుగా వస్తే అది) ఈ వార్షిక పాస్ వినియోగించుకోవచ్చు.
News March 14, 2026
భూపాలపల్లి MLA పీఏ అరెస్టు

భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణ రావు పీఏ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిట్యాల మండలానికి చెందిన దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని కాదని, ఓ మహిళా SIని వివాహం చేసుకునేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యాడని పేర్కొంది. ఈ మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News March 14, 2026
ASF: గుండెపోటుతో వార్డు మెంబర్ మృతి

కౌటాల మండలంలోని మొగడ్ దగడ్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యురాలు తారాబాయి(50) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. ఉదయం ఇంట్లో పని చేస్తుండగా ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రజా ప్రతినిధి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


