News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 24, 2026
నేర నియంత్రణలో రాజీ పడవద్దు: SP విక్రాంత్

కర్నూలు జిల్లాలో నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక దృష్టి, డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్, రాత్రి గస్తీ బలోపేతం చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను పకడ్బందీగా విచారించి పరిష్కరించాలన్నారు.
News March 24, 2026
నేబర్‌హుడ్ వర్క్‌స్పేస్‌లకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ నేబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ 2025–30లో భాగంగా జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు సమీపంలో కార్యాలయ వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద భవనాలను లీజుకు ఇవ్వదలచిన డెవలపర్లు https://investandhra.ap.gov.in లేదా www.apts.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 24, 2026
రాజీ మార్గమే రాజా మార్గం.. ఈ నెల 28 వరకు లోక్ అదాలత్: ఎస్పీ

ఆసిఫాబాద్ కోర్టులలో ఈనెల 28 వరకు నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నితిక పంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీ మార్గమే ఉత్తమ మార్గమని, కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్న కక్షిదారులు పట్టింపులకు పోకుండా రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్‌లో కేసులను మాఫీ చేసుకోవాలని ఆమె కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ చేసుకునే వారు స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.


