News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 19, 2026
VJA: 2024కు ముందు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదన్న సీఎం

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో AP ప్రభుత్వం ఉగాది వేడుకలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలు, విధ్వంసాలతో భయం గుప్పిట్లో ఉందన్నారు. 2024కు ముందు ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకునే పరిస్థితి లేదన్నారు. అప్పటి పాలనలో అరాచకమే రాజ్యమేలిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి, సంతోషం కనిపిస్తుందని పేర్కొన్నారు.
News March 19, 2026
తిరుమలలో ఉగాది ఆస్థాన వేడుకలు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వహించారు. సుప్రభాతం అనంతరం శుద్ధి చేసి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఊరేగింపుగా ప్రవేశించి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించారు. పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఆస్థానం జరిగింది.
News March 19, 2026
NZB: 89 మంది సభ్యులతో DCC నూతన కార్యవర్గం

నూతనంగా 89 మందితో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని గురువారం విస్తరించారు. ఇప్పటికే గత డిసెంబర్లో డీసీసీ అధ్యక్షునిగా కాటిపల్లి నగేష్ రెడ్డిని నియమించిన TPCC గురువారం పూర్తి స్థాయి కమిటీని ప్రకటించింది. ఇందులో 12 మందిని ఉపాధ్యక్షులుగా, 24 మందిని ప్రధాన కార్యదర్శులుగా, నలుగురిని అధికార ప్రతినిధులుగా, 48 మందిని కార్యదర్శులుగా ప్రకటించారు.


