News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 25, 2026
సుప్రీం కోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు

పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ కింద 6 ప్యాకేజీల పనులు చేశామని, రూ.64.18 కోట్ల బిల్లులు రావాలన్నారు. తన భర్త, కుమారుడు ప్రతి పక్షంలో ఉన్నారని, అందుకే GOVT బిల్లులను విడుదల చేయలేదన్నారు. దీన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది.
News March 25, 2026
వికారాబాద్: పెట్రోల్ బంకులు బంద్.. పోటెత్తారు!

త్వరలో పెట్రోల్ కొరత రానందన్న వదంతుల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్దకు వాహనదారులు పోటెత్తారు. మంగళవారం సాయంత్రం నుంచి పలుచోట్ల ముందస్తుగా పెట్రోల్ పోయించుకుంటుండటంతో స్టాక్ అయిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో స్టాక్ ఉన్న బంకుల్లో పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. ఉ.6గం.కి వాహనాలు క్యూలైన్ కట్టడం గమనార్హం. మీ ఏరియాలో ఇలాగే ఉందా?
News March 25, 2026
ఆముదం సాగుకు అనువైన రకాలు

☛ DCH-177: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ DCH-519: 90-180 రోజులు. దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ PCH-111: 90-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ PCH-222: 90-170 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ GCH-08: 95-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ ICH-66: 90-180 రోజులు. దిగుబడి: 7-9 క్వింటాళ్లు
☛ ICH-5: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 7-9 క్వింటాళ్లు


