News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
‘మధుబాల’గా మెప్పించనున్న సాయిపల్లవి?

‘ఏక్ దిన్’ సినిమాతో <<19355627>>బాలీవుడ్‌లో<<>> అడుగుపెట్టనున్న సాయి పల్లవి మరో హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించనున్న అలనాటి బ్యూటీ క్వీన్ మధుబాల బయోపిక్ కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ మూవీతోపాటు ధనుష్ సినిమాతో బిజీగా ఉన్నారు.
News March 16, 2026
కామారెడ్డి అభివృద్ధిపై రాజకీయ చర్చ..!

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పని తీరుపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రులను కలవకుండా కేంద్ర మంత్రులను మాత్రమే కలుస్తున్నారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. కామారెడ్డి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని, రాష్ట్ర మంత్రులను కలిసి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
News March 16, 2026
ప.గో: సీఆర్పీలకు ఐదు నెలలుగా అందని వేతనాలు

పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నియమించిన సీఆర్పీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియామకమై ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు అందకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగ భద్రతపై అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో గందరగోళం నెలకొందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


