News March 29, 2024
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారికంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్‌ని జత చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దేశంలో అతి తక్కువ కేసుల్లోనే ఈ యాక్ట్‌ని ప్రయోగించారు. ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసుల్లోనే నిందితులు ప్రణీత్, తిరుపతన్న, భుజంగరావును విచారించారు.
Similar News
News November 4, 2025
మంత్రి అజహరుద్దీన్‌కు శాఖల కేటాయింపు

TG: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్), మైనారిటీ వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆయనకు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ శాఖను సీఎం రేవంత్ అజహరుద్దీన్‌కు ఇవ్వలేదు.
News November 4, 2025
రేపు వరల్డ్ కప్ విజేతలకు PM ఆతిథ్యం

ICC ఉమెన్ వరల్డ్ కప్-2025 కైవసం చేసుకున్న భారత క్రికెటర్ల బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు(NOV 5న) ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని PMO బీసీసీఐకి పంపింది. ఈరోజు సాయంత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో క్రికెటర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన పైనల్లో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చిరకాల స్వప్నం వరల్డ్ కప్‌ను సాధించడం తెలిసిందే.
News November 4, 2025
ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో ఆహారపదార్థాలను పెట్టడానికి ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ కంటైనర్లపై ప్లాస్టిక్ కంటైనర్ల food-grade/ BPA-free అని ఉంటేనే వాడాలి. వాటిలో వేడి పదార్థాలు వేయకూడదు. పగుళ్లు, గీతలున్న ప్లాస్టిక్ వస్తువులు వాడకపోవడమే మంచిది. PETE రకం ప్లాస్టిక్ డబ్బాలను ఒకట్రెండు సార్లు మాత్రమే వాడాలని చెబుతున్నారు.


