News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 17, 2026
బిల్లులో గ్యాస్ ఛార్జ్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

హోటల్ బిల్లులో ఫుడ్ ప్రైస్, GST తప్ప మరే ఇతర ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని వినియోగదారుల రక్షణ చట్టం (2019) చెబుతోంది. ఇటీవల ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్వీస్ ఛార్జ్ అయినా, మరే ఇతర పేరుతో అయినా కస్టమర్ అనుమతి లేకుండా ఎక్స్‌ట్రా డబ్బులు అడగొద్దు. పెరిగిన ఖర్చులను మెనూ ధరల్లో చూపించాలే తప్ప విడిగా యాడ్ చేయడం రూల్స్‌కు విరుద్ధం.
News March 17, 2026
NGKL: విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడి మృతి

వెల్దండ మండలం రాఘాయిపల్లి గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వహిందూ పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో నివాసం ఉంటున్నారు. కారు బొలెరో ఢీకొన్న సంఘటనలో ఈ ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.
News March 17, 2026
30 రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ క్లోజ్

రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 50ఏళ్ల కాలం నాటి బ్రిడ్జ్ కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్, సంత మార్కెట్ రోడ్డు మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు అధికంగా వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.


