News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 25, 2026
సుల్తానాబాద్ కేంద్రంగా కొత్త నియోజకవర్గం..?

జిల్లాలో ప్రస్తుతం రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలు ఉన్నాయి. సుల్తానాబాద్ కేంద్రంగా ధర్మారం, ఎలిగేడు, ఓదెల, జూలపల్లి మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, అంతర్గాం, పాలకుర్తి(పెద్దపల్లి), రామగుండం మున్సిపాలిటీ కేంద్రంగా ఒక నియోజకవర్గం, కమాన్ పూర్, రామగిరి, ముత్తారం మంథని మండలాలతో నియోజకవర్గాలు ఏర్పడతాయనే చర్చ SMలో నడుస్తోంది.
News March 25, 2026
మూడు నియోజవర్గాలుగా ‘రాజన్న సిరిసిల్ల’..?

జిల్లాలో ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, ఎల్లారెడ్డిపేట కేంద్రంగా గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, కోనరావుపేట మండలాలతో మరో నియోజకవర్గం ఏర్పడుతుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాలతో వేములవాడ నియోజకవర్గం, సిరిసిల్ల, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలతో సిరిసిల్ల నియోజకవర్గం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
News March 25, 2026
KNR: ఆయిల్ పామ్ లక్ష్యం ‘లక్షల్లో’.. సాగు ‘వేలల్లో’

ఉమ్మడి KNR(D)లో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 2022-26 నాలుగేళ్ల కాలానికి 1.30 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు సాధించింది కేవలం 11,900 ఎకరాలు మాత్రమే. PDPL 45,000 ఎకరాల లక్ష్యానికి గానూ 3,000 ఎకరాల్లోనే సాగు. KNR 45,000 గాను 2,200 ఎకరాల్లోనే సాగు. JGTL 8,500- 4,500. SRCL 8,500- 2,200 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.


