News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 8, 2026
విశాఖలో రూ.626.9 కోట్లతో iSprout బిజినెస్ సెంటర్

విశాఖకు మరో మెగా ప్రాజెక్ట్‌కు రాబోతుంది. iSprout సంస్థ రూ.626.9 కోట్లతో ఆధునిక బిజినెస్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌తో స్టార్టప్స్, IT సంస్థలు, కో-వర్కింగ్ స్పేస్‌లు, భవిష్యత్ కార్యాలయాలకు పెద్ద ఊతం ఇవ్వనుంది. విశాఖను బిజినెస్ హబ్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు,నగర ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ ప్రాజెక్ట్ బలాన్నిస్తుంది.
News April 8, 2026
నిర్మల్ జిల్లా జడ్పీ సీఈవోగా భాగ్యలక్ష్మి

నిర్మల్ జిల్లా జడ్పీ సీఈవోగా భాగ్యలక్ష్మిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా డిప్యూటీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న భాగ్యలక్ష్మిని నిర్మల్ జిల్లా సీఈవోగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ జడ్పీ సీఈవోగా శంకర్ విధులు నిర్వహిస్తున్నారు. భాగ్యలక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.