News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 1, 2026
NRPT: జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు

జిల్లాలో ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, కర్షక, యువజన, కుల సంఘాల నేతలు బహిరంగ సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారాదని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 1, 2026
పెన్షన్‌ల పంపిణీ సక్రమంగా జరగాలి: అనకాపల్లి కలెక్టర్

ప్రతి లబ్ధిదారునికి పెన్షన్‌లు సక్రమంగా అందేలా పంపిణీ పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం 84వ వార్డు పెరుగు బజారులో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 2,53,356 మంది లబ్ధిదారులకు రూ.107,75,70,500 పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. శత శాతం పంపిణీ మొదటి రోజే పూర్తి చేయాలన్నారు.
News April 1, 2026
NLG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. నిర్మాణంలో జాప్యం

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు జాప్యంతో సాగుతున్నాయి. గంధంవారిగూడెంలో ఒక బ్లాక్ మినహా మిగిలినవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మునుగోడు, గడ్డిపల్లి, చిలుకూరు, తుర్కపల్లిలో నిర్మాణాలు ఆరంభంలోనే ఉండగా, నకిరేకల్‌లో స్థలసేకరణ మాత్రమే పూర్తయింది. సాగర్, DVK, MLGలో అసంపూర్తిగా ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి స్కూళ్లు సిద్ధం కావడం కష్టంగానే ఉంది.


