News March 29, 2024
నిర్మల్: అనారోగ్య కారణాలతో యువతి ఆత్మహత్య
అనారోగ్యంతో విసిగిపోయి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అలగొండ విజయలక్ష్మి(20) బీడీ కార్మికురాలిగా పనిచేసేది. గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో విసుగుచెందిన ఆమె ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకొని చనిపోయినట్లు SI చంద్రమోహన్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 12, 2025
నిర్మల్: మహిళా ఆటో డ్రైవర్ను అభినందించిన ఎస్పీ
ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై నిర్మల్ పాత బస్టాండ్, ట్యాంక్ బండ్, మయూరి సర్కిల్ ఏరియాలో ఎస్పీ జానకీషర్మిల శనివారం పర్యటించారు. అందులో భాగంగా పాత బస్టాండ్ ఏరియాలో ఆటో నడుపుతున్న మహిళా డ్రైవర్ను ఎస్పీ ఆప్యాయంగా పలకరించారు. డ్రైవింగ్ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
News January 12, 2025
బెల్లంపల్లి: భోజనం నాణ్యతలో రాజీపడొద్దు. జీఎం
బెల్లంపల్లి ఏరియా కైరుగూడ ఓపెన్ కాస్ట్లో జీఎం శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నరేందర్, గుర్తింపు AITUC సంఘం నాయకులు క్యాంటీన్ను శనివారం తనిఖీ చేశారు. క్యాంటీన్లో కార్మికులకు అందుతున్న అల్పాహారం, భోజనం, ఏర్పాట్లను పరిశీలించారు. జీఎం మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని పర్సనల్ ఆఫీసర్ వేణును ఆదేశించారు. యూనియన్ నాయకులు అధికారులు ఉన్నారు.
News January 11, 2025
బాసర ఆర్జీయూకేటీకీ JAN13 నుంచి సెలవులు
బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో చదివే పీయూసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ సెలవులను వర్సిటీ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు సెలవులిచ్చారు. 19న ఆదివారం సాధారణ సెలవుదినం రావడంతో తరగతులు 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.