News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 6, 2026
కొండపాటూరు తిరునాళ్ల.. భక్తులకు శుభవార్త

కాకుమాను (M) కొండపాటూరు పోలేరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి డి. సాంబ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, పొన్నూరు డిపోల నుంచి 20 బస్సులు తిరుగుతాయన్నారు. గుంటూరులో ఉదయం 5.30ని.ల నుంచి ప్రతీ అరగంటకు ఒక బస్సు, పెదనందిపాడు-కొండపాటూరు మధ్య 10ని.లకు ఒక బస్సు, పొన్నూరు- కొండపాటూరుకు ప్రతీ 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని తెలిపారు.
News April 6, 2026
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 204 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ సీజన్‌లో సుమారు 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. మిల్లర్లు వెంటనే CMR లక్ష్యాలను పూర్తి చేసి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పేర్కొన్నారు.
News April 6, 2026
కదిరిలో కన్నకొడుకును చంపిన తండ్రి అరెస్ట్

కదిరి పట్టణంలోని సైదాపురంలో కన్నకొడుకును హత్య చేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 1వ తేదీన కొమ్మినేని గణేశ్ (26) ను అతని తండ్రి నారాయణ స్వామి హత్య చేయగా, మృతుడి తల్లి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి, సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మీడియాకు వెల్లడించారు.


