News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 20, 2026

‘పిరికిపందలు’.. నాటో దేశాలపై ట్రంప్ ఫైర్!

image

ఇరాన్‌పై పోరులో నాటో దేశాలు భాగం కాకపోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. US లేకపోతే నాటో ఎందుకూ పనికిరాదని విమర్శించారు. ఆయిల్ ధరలపై ఆ దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి కానీ హార్ముజ్‌ను క్లియర్ చేసేందుకు మాత్రం సహాయపడట్లేదన్నారు. హార్ముజ్‌ను క్లియర్ చేయడం ఆ దేశాలకు సులువైన పనేనని అన్నారు. ఈ వైఖరిని గుర్తుపెట్టుకుంటానన్న ట్రంప్.. నాటో దేశాలను పిరికిపందలుగా అభివర్ణించారు.

News March 20, 2026

జనగామ: కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 201 దరఖాస్తులు

image

కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం జనగణన-2026 విధులకు కాంట్రాక్ట్ పద్ధతిలో అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగిసింది. మొత్తం 201 మంది ఉద్యోగార్థులు ఇందుకు దరఖాస్తు చేసినట్లు కలెక్టరేట్ సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన వారిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎంపిక చేసి 18 నెలల పాటు జనగణన విధులు అప్పగించనున్నారు.

News March 20, 2026

రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ ఈ పండుగ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని చేకూర్చాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.