News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
NZB: ‘గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన వద్దు’

వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. IDOCలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నులపై ఈ సమావేశంలో సమీక్షించారు.
News March 13, 2026
విశాఖ: బుకింగ్ చేసినా ఆలస్యంగా గ్యాస్ డెలివరీ..!

విశాఖలో గ్యాస్ సరఫరా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సుమారు 9 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 26,000 నుంచి 30,000 సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అయితే ప్రస్తుతం రోజువారీ సరఫరా 16,000 నుంచి 19,000 సిలిండర్లకు తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో సిలిండర్ 24 గంటల్లో అందుతుండగా, ప్రస్తుతం వినియోగదారులు 7 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News March 13, 2026
నిర్మల్: IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను RGUKT బాసర VC గోవర్దన్ నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. RGUKTలో ప్రవేశాలకు సంబంధించిన అప్‌డేట్‌ను అధికారిక వెబ్సైట్ https://www.rgukt.ac.in/ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


