News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 20, 2026

అంగన్‌వాడీలకూ ‘ఒంటిపూట’ ఊరటనిచ్చేనా?

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎండ తీవ్రతతో చిన్నారులు అల్లాడుతున్నారు. పాఠశాలలకు ఒంటిపూట బడులు అమలవుతున్నా, అంగన్‌వాడీలు మాత్రం సాయంత్రం వరకు కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. చల్లని తాగునీరు వంటి కనీస వసతులు లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అంగన్‌వాడీలకూ ఒంటిపూట పనివేళలు అమలు చేయాలని తల్లిదండ్రులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

News March 20, 2026

ఎచ్చెర్ల: 5 నోటిఫికేషన్లు.. నియామకాలు నిల్.!

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఐదు సార్లు ఫ్యాకల్టీ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. నియామకాలు మాత్రం చేపట్టలేదు. 2013లో 34, 2014లో 15, 2017లో 48, 2018లో 32, 2023లో 98 పోస్టులకు నోటిఫికేషన్లు వేశారు. కొన్నిసార్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినా నియామకాల మాత్రం జరగలేదు. ప్రస్తుతం రెగ్యులర్ ఫ్యాకల్టీ సభ్యులు ఏడుగురు మాత్రమే విశ్వవిద్యాలయంలో ఉన్నారు.

News March 20, 2026

భద్రాద్రి రామయ్య ప్రత్యేకత ఇదే

image

భద్రాచల క్షేత్రంలో సీతారామచంద్ర స్వామి వారు విశిష్ట రూపంలో కొలువై భక్తులను మురిపిస్తున్నారు. దేశంలోని ఇతర రామాలయాలకు భిన్నంగా ఇక్కడ స్వామివారు నాలుగు చేతులతో శంఖు చక్రాలు, విల్లంబులు ధరించి దర్శనమిస్తారు. సీతమ్మ వారు రాములవారి ఎడమ తొడపై ఆశీనులై ఉండటం, లక్ష్మణ స్వామి ఎడమ వైపున ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అపురూప సౌందర్యాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.