News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

image

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.

News March 13, 2026

WGL: వెంట్రుకల చోరీ కేసులో నలుగురి అరెస్టు

image

బట్టల బజార్‌లోని శ్యామల ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.10 లక్షల విలువైన వెంట్రుకలను దోచుకెళ్లిన కేసులో నలుగురు నిందితులను మట్వాడ పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 9న షేక్ బషీరా, షేక్ సలీమా, షేక్ నయీమ్,నాగన్న అనే వ్యక్తులు యజమాని కుమారస్వామిపై దాడి చేసి వెంట్రుకల బస్తాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

News March 13, 2026

ఆర్మూర్: టెన్త్ పరీక్షలు.. 5 నిమిషాల వెసులుబాటు

image

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:35 గంటల వరకు (5 నిమిషాల ఆలస్యం) వచ్చే విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వస్తే అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి వచ్చేందుకు ముందుగానే ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.