News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 21, 2026

నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం

image

నెల్లూరు జిల్లాలో వరి పంట చేతికోస్తుంది. ఈక్రమంలో అకాల వర్షాలు రైతులను ముంచేసింది. అనంతసాగరం, కలవాయి,రాపూరు, మర్రిపాడు మండలాల పరిధిలో ఇటీవల వర్షం కురిసింది. దీంతో 19 గ్రామాల పరిధిలో వరి 1157 హెక్టర్లు, పత్తి 140 హెక్టర్లలో మొత్తంగా 1297 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు.

News March 21, 2026

సంగారెడ్డి: రోగుల వివరాలు ఇక డిజిటల్ రూపంలో..

image

రోగుల పూర్తి వైద్య వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో జరిగిన శిక్షణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టు కింద జోగిపేట, పటాన్‌చెరు, సదాశివపేట ఏరియా ఆసుపత్రులతో పాటు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల డిజిటల్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని తెలిపారు.

News March 21, 2026

పిట్లం: షీర్ ఖుర్మా.. పాలకు డిమాండ్

image

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా పిట్లంలో పాల ధరలు పెరిగాయి. పండుగ ప్రత్యేక వంటకమైన ‘షీర్ ఖుర్మా’ తయారీకి పాలు ప్రధానం కావడంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో కంటే అదనపు అవసరం ఉండటంతో పాల కేంద్రాల్లో లీటర్ పాలు రూ.80 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో లీటర్ పాల ధర ఎంత ఉందో? కామెంట్ రూపంలో తెలియజేయండి.