News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 7, 2026

మౌలిక వసతుల కల్పనలో జిల్లా నివేదికలను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 11, 12వ తేదీల్లో రాష్ట్ర రాజధానిలో జరగనున్న 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకొని కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం కలెక్టరేట్ నుంచి రెండు జిల్లాలలోని జిల్లా స్థాయి అధికారులతో, వర్చువల్, వీసీ నిర్వహించారు. గత కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం సూచించిన లక్ష్యాల అమలు తీరుపై సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా సాధించిన పురోగతిని స్పష్టంగా అర్థమయ్యేలా రూపొందించాలన్నారు.

News March 7, 2026

కాకినాడ: నిరుద్యోగులకు GOOD NEWS

image

కాకినాడలో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌లతో ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు  8639846568 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News March 7, 2026

నెల్లూరు జిల్లాలో మహిళలే రథసారథులుగా.!

image

మహిళా అధికారులే జిల్లాను నడిపిస్తున్నారు. SP అజిత వేజెండ్ల, ASPలు దీక్ష, సౌజన్య DMHO సుజాత, గంగా భవాని(డ్వామా), నాగరాజకుమారి(DRDA), లీలారాణి(మెప్మా), శాంతి(మత్స్య), షమీమ్(RTC DM), రాజకీయంగా MLAలు ప్రశాంతి రెడ్డి, నెలవల విజయశ్రీ, ZP ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ దేవరకొండ సుజాత, గ్రంథాలయ ఛైర్మన్ మేకపాటి శాంతకుమారి జిల్లాను రథసారథులుగా నడిపిస్తున్నారు.
# అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పెషల్.