News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 9, 2026
పార్వతీపురం: ‘మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు’

పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100 నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.
News March 9, 2026
అనకాపల్లి: ఇటీవల తండ్రి.. ఇప్పుడు కొడుకు మృతి

ఎలమంచిలి (M) ఏటికొప్పాక వరాహనది సమీపంలో రక్తపు మడుగులో <<19331621>>బాలుడు కౌసిక్ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. సీఐ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించి బాలుడి శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తోటి బాలురను విచారించారు. కాకినాడ(D) తునికి చెందిన కౌశిక్ ఏటికొప్పాకలో మేనమామల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. కౌశిక్ తండ్రి ఇటీవల మృతి చెందడం గమనార్హం.
News March 9, 2026
జూరాల సామర్థ్యం పెంచేలా డీసిల్టింగ్ పనులు

జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి ఆదేశించారు. ప్రాజెక్టు 11.94 టీఎంసీలు కాగా, పూడిక వల్ల అది 9 TMCలకు పడిపోవడంపై సమీక్షించారు. నీటి నిల్వ సామర్థ్యం తిరిగి పెంచి, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి, పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.


