News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
ఆదిలాబాద్: మూడు నెలల రేషన్ ఒకేసారి

పెరుగుతున్న ఎండల దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. నిర్మల్ జిల్లాలో 2.18 లక్షల మందికి, ఆదిలాబాద్‌లో 2.05 లక్షల కార్డుదారులకు ఈ వెసులుబాటు కలగనుంది. నిజామాబాద్ నుంచి బియ్యం సరఫరా వేగవంతమైంది. దీనివల్ల లబ్ధిదారులు ప్రతి నెలా ఎండలో వరుస కట్టాల్సిన అవస్థలు తప్పుతాయి.
News March 22, 2026
కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో ఖతర్‌కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడని అధికారులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు, మిస్సింగ్ పర్సన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని పేర్కొన్నారు.
News March 22, 2026
జమ్మలమడుగు యువకుడికి ఆల్ ఇండియా ర్యాంక్

జమ్మలమడుగు (M) ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ గేట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మెకానికల్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్) విభాగంలో ఆల్ ఇండియా 89వ ర్యాంక్ సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ తల్లిదండ్రులు సంజీవరాయుడు, లక్ష్మీదేవి, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.


