News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 7, 2026
హౌసింగ్ బోర్డు పోర్టల్ ప్రారంభించిన పొంగులేటి

తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలోని 5 వేల పెండింగ్ రిజిస్ట్రేషన్లను 99 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో కొత్త రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించిన ఆయన.. ప్రజలు అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే సేవలు పొందవచ్చన్నారు. పారదర్శకత, వేగవంతమైన పాలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
News March 7, 2026
మహిళలు ముందుకు వస్తేనే నిజమైన అభివృద్ధి: నిర్మల్ ఎస్పీ

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తేనే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మహిళల భద్రత, సాధికారత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసుల ద్వారా ‘పోలీస్ అక్క’, ‘నారిశక్తి’, ‘శివంగి’ వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మహిళల భద్రతకు మరింత బలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నమని వివరించారు.
News March 7, 2026
సంగారెడ్డి: అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వాల్టా, మోటార్ వాహనాల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమించే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సాండ్ బజార్ల ద్వారా ప్రభుత్వ ఇసుక సరఫరాను పర్యవేక్షించాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచాలని సూచించారు.


