News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 21, 2026

ఏర్గట్ల: చిట్టి చేతులు..చక్కని కవితలు

image

నేటి తరం విద్యార్థులు సిలబస్ అనే చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కానీ తడపాకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదవడం, రాయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కలాలు పట్టి తేలికపాటి పదాలతో అందరికీ అర్థమయ్యేలా కథలు, కవితలు రాసేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి పురస్కారాలు, ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 15కి పైగా సంపుటులు ఆవిష్కరించారు.
# నేడు ప్రపంచ కవితా దినోత్సవం

News March 21, 2026

సాగర్ నీటిమట్టం పతనం.. రైతన్నల్లో ఆందోళన

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 535.80 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎడమ కాలువకు 8541 క్యూసెక్కులు, కుడి కాలువకు 1023, ఎస్ఎల్బీసీకి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఒకవైపు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని వదులుతుండగా.. మరోవైపు భానుడి భగభగలకు నీరు ఆవిరైపోతుండటంతో ప్రాజెక్టు అడుగంటుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

News March 21, 2026

తిరుమలలో సరికొత్తగా CM చంద్రబాబు..!

image

తిరుమల పర్యటనలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు సరికొత్తగా కనిపించారు. శ్రీవారి దర్శనం తర్వాత అన్నదానం కేంద్రానికి చేరుకున్నారు. భక్తులకు ఆయనే స్వయంగా వడ్డించారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. తర్వాత బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని లాలించారు. ఆ సమయంలో CM మెడలో ఓ మాల దర్శనమిచ్చింది. చంద్రబాబు సరికొత్తగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.