News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 19, 2026

MBNR: రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా MLA యెన్నం శ్రీనివాసరెడ్డి

image

మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా శాసనసభలో నియమిస్తూ.. గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ఆయనకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలలో మరింత కీలక బాధ్యతలు అప్పగించినట్లు భావిస్తున్నారు. MLA కొంతకాలంగా పార్టీకి విశేష సేవలు అందిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొన్నారు. పనితీరును గుర్తించి ప్రభుత్వం విఫ్‌గా నియమించింది.

News March 19, 2026

ప్రజలందరికీ ‘ఉగాది’ శుభాకాంక్షలు: సంగారెడ్డి ఎస్పీ

image

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం ఉగాది పండుగ అని ఎస్పీ పారితోష్ పంకజ్ పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంటా కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

News March 19, 2026

చిత్తూరు కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు.