News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 6, 2026
బుమ్రా అందుకు అర్హుడు: సంజూ శాంసన్

T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై <<19308021>>ఉత్కంఠ పోరు<<>>లో టీమ్ ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మన కంట్రోల్‌లోకి తెచ్చిన బుమ్రాపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించారు. ‘బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు అలా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను POTMను అందుకునే వాడిని కాదు. ఈ అవార్డుకు నా కన్నా తనే ఎక్కువ అర్హుడు. డెత్ ఓవర్లలో అసాధారణ ప్రదర్శన చేశాడు’ అని కొనియాడారు.
News March 6, 2026
పల్నాడు: ఫులె రెసిడెన్షియల్ పాఠశాలల దరఖాస్తు గడువు పొడిగింపు

మహాత్మ జ్యోతిరావ్ ఫూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 12 వరకు ప్రభుత్వం పొడిగించినట్లు పల్నాడు జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ పొట్లూరి పరమేశ్వరరావు గురువారం రాత్రి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఉచిత విద్య, భోజన, వసతి, స్కాలర్ షిప్ సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 6, 2026
వనపర్తి: ఆటో-ట్రాక్టర్ ఢీ.. ఇద్దరి మృతి

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాలు.. ఏదుల నుంచి సంత/కూరగాయల మార్కెట్ ముగించుకొని 12 మందితో వెళ్తున్న ఆటో, రేవల్లి నుంచి వనపర్తికి వెళ్తున్న వరి పొట్టు ట్రాక్టర్ రెండు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలోని వెంకటయ్య(50) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను రేవల్లి, కోడేరు, పానగల్ అంబులెన్స్ ద్వారా వనపర్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు. మార్గమధ్యలో సుమిత్ర(42) చనిపోయారు.


