News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 10, 2026
తల్లి, చెల్లిని దూషించే సంస్కృతి పోగొట్టేలా!

మహిళల గౌరవాన్ని కాపాడేందుకు మహారాష్ట్రలోని కొల్గావ్ గ్రామ పంచాయతీ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. గొడవల్లో తల్లి, చెల్లిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషిస్తే రూ.500 జరిమానా విధిస్తామని తీర్మానించింది. దీనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కఠిన నిబంధనలు అన్నిచోట్లా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నిర్ణయం అసభ్య సంస్కృతికి అడ్డుకట్ట వేస్తుందని పలువురు ఆశిస్తున్నారు. మీ కామెంట్?
News March 10, 2026
గుంటూరులో స్పా ముసుగులో వ్యభిచారం..!

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. నల్లపాడు PS పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. నలుగురు వ్యక్తులు, 4 సెల్ ఫోన్లు, PPAY ద్వారా జరిగిన రూ.24,200ల నగదు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
News March 10, 2026
బాపట్ల: ఇంటర్ పరీక్షలకు 341 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 341 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ ప్రకటించారు. జిల్లాలో మొత్తం 8,637 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 8,296 మంది మాత్రమే హాజరయ్యారన్నారు. 341 మంది హాజరు కాలేదన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు.


